తెలుసు కదా మూవీ రివ్యూ
ముందుగా టీజర్ తో సాఫ్ట్ మూవీ గా ప్రమోట్ చేసుకున్న తెలుసు కదా సినిమా తర్వాత వచ్చిన రెండు చాట్ బస్టర్ సాంగ్స్ తో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది.
సినిమా రిలీజ్ కి 4 రోజులు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది
ఇద్దరు హీరోయిన్స్ తో హీరోని వాళ్ల కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తూ ఒక లేడీ డైరెక్టర్ నీరజ కోన ఎలా చూపించి ఉంటారు అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేసింది
కథ విషయానికి వస్తే ఒక నార్మల్ పాయింట్ లాగే ఉంటుంది కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఉన్న రిలేషన్ షిప్ మరియు పిల్లల గురించి పడే తాపత్రయాన్ని మెయిన్ ప్లాటుగా తీసుకున్నారు
పర్ఫామెన్స్ పరంగా సిద్దు జొన్నలగడ్డ తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పాలి వరుణ్ గా క్యారెక్టర్ లో ఒదిగిపోయారు.
తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ , స్టైలింగ్ గాని చాలా బాగున్నాయి ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించారు. శ్రీనిధి శెట్టి మరియు రాశి కన్నా ఓన్లీ గ్లామరే కాకుండా మంచి పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు
ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్ వావ్ అనిపిస్తాయి కొన్నిచోట్ల lag అనిపిస్తుంది డైరెక్టర్ నీరజ కోన డైలాగ్స్ గానీ టేకింగ్ కానీ కొన్నిచోట్ల బాగుంది ఓవరాల్ గా నీట్ గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పొచ్చు
వైవా హర్ష కామెడీ చాలా బాగా పండింది, సిద్దుతో ఉన్న ప్రతి సీన్ అదరగొట్టేశారు..
ఇక టెక్నికల్ విషయాలకు వస్తే తమన్ ఆ రెండు సాంగ్స్ తప్ప మిగతా అన్నిచోట్ల ఫెయిల్ అయ్యారు అన్నట్టుగానే అనిపించింది బిజిఎం కూడా అంతగా ఏం లేదు ఒకటే బిజిఎం అన్నిచోట్ల use చేసినట్టు ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి కానీ ఎక్కువ లొకేషన్స్ ఉండకపోవడం ఒకే చోట సినిమా అంతా తిరగడం లాగా అనిపిస్తుంది
సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ అందరినీ కన్విన్స్ చేయడానికి తనకి కన్వీనెంట్గా మాట్లాడడం జరుగుతుంది. అది అందరికీ ఎక్కకపోవచ్చు కానీ ప్రజెంట్ జనరేషన్ మాత్రం బాగానే కనెక్ట్ అవుతారు కొన్ని కొన్ని చోట్ల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ అంటూ వాడిన డైలాగ్స్ మరి రిపీటీటివ్గా అనిపించాయి ఓవరాల్ గా తెలుసు కదా చిత్రం ఒక ott film అనే భావన కలిగిస్తుంది.
క్లైమాక్స్ అయితే ఏదో ఆడియన్స్ సాటిస్ఫై చేయడానికి పెట్టినట్లు ఉంటుంది తప్ప హీరో అప్పటిదాకా మాట్లాడిన పాయింట్స్ కి జస్టిఫికేషన్ అయితే ఇవ్వదు.
అంతగా బోర్ కొట్టదు అలా అని బాగా excite చేసే లాగా ఉండదు. గివ్ ఇట్ ఏ ట్రై