డ్యూడ్ మూవీ రివ్యూ
డైరెక్టర్ గా రైటర్ గా రైటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తమిళ్లో కోమలితో ఫెయిల్ అయిన ప్రదీప్ రంగరాధన్ హీరోగా మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో కూడా ముఖ్యంగా యూత్ లో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో మూడో చిత్రం డ్యూడ్ ఈరోజు గ్రాండ్గా విడుదలైంది.
ట్రైలర్ మరియు ప్రమోషనల్ మెటీరియల్ లో ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అని ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లో మాత్రం డిఫరెంట్ ఫీల్ కలిగించింది.
కథ విషయానికి వస్తే హార్ట్ బ్రేక్ అయిన హీరో తన వీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు తనతో పాటు చిన్నప్పటినుండి కలిసి పెరిగిన తన మరదలు ప్రపోజ్ చేయడం అతను రిజెక్ట్ చేయడం..
తర్వాత తను కూడా ప్రేమిస్తున్న అని రియలై జ్ అయ్యే టైం కి ఆమె వేరే వాళ్ళని ప్రేమించడం ఇలా కథ ముందుకు సాగుతుంది అయితే ఇందులో జరిగిన ట్విస్ట్ ఏంటి., హీరో హీరోయిన్ కోసం ఏం చేశాడు? వారి ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది మీరు సినిమాలో చూడాల్సిందే
పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ మధ్య తరగతి కుర్రాడిగా ధనుష్ లాంటి swag తో అక్కడక్కడ రజిని మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. అతని attire వల్ల కానీ డైలాగ్ డెలివరీ వల్ల కానీ మనలో ఒకడు అనిపించే క్యారెక్టర్ లాగా తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రదీప్ చాలా బాగా చేశాడు. ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మలయాళం ముద్దుగుమ్మ mamita బైజు ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ portray చేశారు.
ఎమోషనల్ సీన్స్ లో కానీ మిగతా డెప్త్ ఉన్న సీన్స్ లో గాని తన యాక్టింగ్ తో కట్టిపడేశారు.
హీరోకి మామ పాత్రలో సుప్రీం స్టార్ శరత్ కుమార్ చాలా మంచి మార్కులు కొట్టేశారు.
ఆర్టిస్టులంతా మాక్సిమం తమిళ్ వాళ్ళు అవడం, డైరెక్టర్ కూడా అక్కడి వాడే అవడం వల్ల కానీ మూవీ తమిళ్ ఫ్లేవర్ లోనే ఎక్కువ కనిపిస్తుంది.
ఇక డైరెక్టర్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ పాయింట్ తో మనం ముందుకు వచ్చారు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా lite గానే ఉంటుంది.
రకరకాల కారణాల వల్ల విచిత్రం మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ అయితే నచ్చదని అనుకుంటున్నాను, స్టోరీలో సాంగ్ పాయింట్ లేదా అంటే honor killings గురించి gen Zee యువత రియాక్ట్ అయ్యే విధానాన్ని బాగానే చూపించిన సరే ఎక్కడో ఎగ్జిక్యూషన్లో తడబడినట్టు కనిపిస్తుంది.
డైలాగ్స్ అంత గొప్పగా ఏం లేవు, కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది.
హీరో, హీరోయిన్ మధ్య చిన్నప్పటి బాండింగ్ ఎక్కువ చూపించకపోవడం వల్ల ఆ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ మధ్య జరిగే విషయాలకి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వలేము.
మ్యూజిక్ పరంగా యంగ్ బ్లడ్ సాయి అభ్యెంకర్ బాగానే న్యాయం చేశాడు,. ట్రైలర్ చివర్లో వచ్చే సాంగ్ బిట్ దాన్నే సినిమా అంతా కూడా వాడటం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ కలిగించలేదు.
విజువల్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా ఏమీ లేవు
ఓవరాల్ గా డ్యూడ్ మూవీ డ్రాగన్, లవ్ టుడే లాంటి సినిమాలను మనసులో పెట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇదివరకు చిత్రాల్లో కూడా హీరో త్యాగాలు చేస్తాడు అందులో మనం రూట్అవుతాం కానీ ఇక్కడ ఈ క్లైమాక్స్ లో వచ్చే మెసేజ్ కానీ, ఆ ఎండింగ్ గాని అందరూ తీసుకోలేరు.
సినిమా ఎక్కడ బోరింగ్ అనిపించదు కానీ తీసుకున్న పాయింట్ ను స్ట్రాంగ్ గా చెప్పలేకపోయారు అనిపిస్తుంది.
ప్రదీప్, మమత యాక్టింగ్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి ఈజీగా చూసేయొచ్చు.